ASR: నవంబర్ 16వ తేదీన ఒరిస్సా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ అల్లూరి జిల్లా కేంద్రమైన పాడేరులో పర్యటించనున్నారు. పాడేరులో భగవాన్ బిర్సాముండా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారని జిల్లా అధికారులు తెలిపారు. ఈమేరకు జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ ఆదేశాలతో పాడేరు డీఎస్పీ షైక్ షహబాజ్ అహ్మద్ నేతృత్వంలో సీఐ డీ. దీనబంధు ఆధ్వర్యంలో భద్రత చర్యలు చేపట్టారు.