VZM: గ్రామాలలో ఉపాధి హామీ పనులు చేపట్టాలని ఫీల్డ్ అసిస్టెంట్లను ఎంపీడీవో పి. రవికుమార్ ఆదేశించారు. బొబ్బిలి ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధి పనులపై సమావేశం నిర్వహించారు. గ్రామాలలో ఉపాధి పనులు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారని, ప్రతి గ్రామంలో పనులు ప్రారంభించి వేతనదారులు పాల్గొనేలా చూడాలన్నారు. కార్మికులకు వేతనం ఎక్కువ వచ్చేలా చూడాలన్నారు.