TTD: నాయుడుపేటలో భారీ మోసం వెలుగు చూసింది. కొమ్మూరు గురు ప్రసాద్ (ప్రసాద్ రెడ్డి), సగ్గం శిల్పా ప్రియాంక అనే ఇద్దరు APRD పేరిట ఓ ఫేక్ కంపెనీ పెట్టారు. రూ.10వేలు కడితే రూ. లక్ష ఇస్తామని నమ్మబలికారు రూ.లక్ష కడితే రూ.కోటి లేదా కారు, ఇంటి స్థలం ఇస్తామని చెప్పారు. వీరి మాటలు నమ్మి చాలామంది రూ. లక్షలు కట్టి మోసపోయారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.