అమెరికాలో గత 43 రోజుల నుంచి కొనసాగుతున్న ప్రభుత్వ షట్డౌన్కు తెరపడింది. షట్‌డౌన్‌ను ముగించే బిల్లుకు US కాంగ్రెస్ 222-209 ఓట్ల తేడాతో ఆమోదం తెలిపింది. ఈ బిల్లును వెంటనే అధ్యక్షుడు ట్రంప్ ఆమోదం కోసం పంపించారు. అధ్యక్షుడు ఈ బిల్లుపై సంతకం చేయగానే, ప్రభుత్వ కార్యకలాపాలు పునఃప్రారంభం కానున్నాయి.