ATP: జిల్లా మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని వన్ స్టాఫ్ సెంటర్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఐసీడీఎస్ పీడీ అరుణకుమారి బుధవారం తెలిపారు. సోషల్ కౌన్సిలర్, మల్టీపర్పస్ స్టాప్/ కుక్, 2 సెక్యూరిటీ గార్డ్/నైట్ గార్డ్ మొత్తం 4 పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీచేయనున్నట్లు తెలిపారు. ఈనెల 25 లోపు దరఖాస్తుల సమర్పించాలన్నారు.