NGKL: కల్వకుర్తిలో మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన ఐదుగురికి స్థానిక న్యాయస్థానం జైలు శిక్ష, జరిమానా విధించినట్లు బుధవారం ఎస్సై మాధవరెడ్డి తెలిపారు. సయ్యద్ గౌస్‌కు 4 రోజులు జైలు, రూ.500 జరిమానా, మల్లికార్జున్ రెడ్డికి 3 రోజులు జైలు, రూ.600 జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. మిగతా ముగ్గురికి కూడా జైలు శిక్ష, జరిమానాలు పడ్డాయి.