ఆదిలాబాద్: జిల్లాపై చలి పంజా విసిరుతోంది. గత మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. వేకువ జామున పొగమంచు కమ్మేస్తుంది. జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు గజగజ వణికిపోతున్నారు. గురువారం ఆదిలాబాద్లో 14 డిగ్రీలు, జైనథ్ 14 డిగ్రీ, ఆర్లీటీలో కనిష్టంగా 13 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.