నాన్న ఆఫీసు నుంచి ఇంటికి రాగానే పిల్లలు ఆనందంతో ఎగిరి గంతేస్తారు. తండ్రితో కలిసి ఆడుకోవాలని వారు రోజంతా ఎదురుచూస్తుంటారు. కానీ నాన్న వచ్చీరాగానే నీరసంగా సోఫాలో కూర్చుని టీవీకి అతుక్కుపోతే చిన్నారులు ఉత్సాహంగా ఉండలేరు. అలా కాకుండా పిల్లలతో కలిసిపోయి హుషారుగా వారితో ఆడుతూ ఉండండి. అవి మీ పిల్లలతో పాటు మీకూ మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి.