CTR: పూతలపట్టు మండలం బండపల్లి సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. పూతలపట్టు వైపు నుంచి చిత్తూరు వైపు వెళ్తున్న ఆటోని ఎదురుగా వచ్చిన టాటా ఏస్ వాహనం ఢీకొట్టింది. కిచ్చన్నగారి పల్లికి చెందిన ఆటో డ్రైవర్ శరత్‌కు గాయాలయ్యాయి. దీంతో 108 వాహనం ద్వారా చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.