AP: మంత్రి నారా లోకేష్ ఇవాళ విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రతిష్టాత్మక వరల్డ్ ట్రేడ్ సెంటర్(WTC) నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అలాగే, సెయిల్స్ సాఫ్ట్వేర్, ఫినోమ్ పీపుల్, ఐ స్పేస్ వంటి కీలకమైన ఐటీ ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపన చేస్తారు. కాగా, రేపటి నుంచి ప్రతిష్టాత్మక సీఐఐ భాగస్వామ్య సదస్సు జరగనుంది.