గాయం కారణంగా ఆస్ట్రేలియా సిరీస్కు దూరంగా ఉన్న టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా రీఎంట్రీకి సిద్ధమయ్యాడు. ప్రస్తుతం గాయం నుంచి కోలుకున్న పాండ్యా.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బరోడా జట్టు తరఫున బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే టీ20 ప్రపంచకప్ జరగబోతుండటంతో, పాండ్యా మళ్లీ మైదానంలో అడుగుపెట్టడం భారత జట్టుకు శుభవార్తగా చెప్పవచ్చు.