ATP: బుక్కరాయసముద్రం మండలం అమ్మవారిపేట గ్రామంలో లబ్ధిదారుల గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు శ్రావణి పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. పేదలకు సొంతింటి కలను సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిజం చేసిందని తెలిపారు. వైసీపీ హయాంలో ఇళ్ల నిర్మాణానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆమె ఆరోపించారు.