HYD: కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధికి రూ.22 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రణాళిక సంఘం మాస్టర్ ప్లాన్ను రూపొందించినట్లు అధికారులు తెలిపారు. ఆలయ పరిసరాల్లో రోడ్లు, పార్కింగ్ స్థలాలు, సౌకర్య వసతులు, భక్తుల వసతి గృహాలు వంటి అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. పూర్తయితే యాదాద్రిలా మరో ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రంగా కీసరగుట్ట కానుంది.