PDPL: కాంగ్రెస్ అంటేనే రైతు ప్రభుత్వమని.. రైతులంటేనే కాంగ్రెస్ అని, రైతుకు మేలు చేసేందుకు తమ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అద్వర్యంలో మంథని మున్సిపల్ పరిధిలోని అంగులూరులో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.