కృష్ణా: గన్నవరం మండలం కేసరపల్లి వద్ద జాతీయ రహదారిపై నిన్న రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వాహనం బైకును వెనుక నుంచి ఢీకొట్టడంతో శ్రీకాకుళం జిల్లాకు చెందిన సంతోష్ (31) అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిద్దరూ గూడవల్లి చైతన్య కళాశాల హాస్టల్లో వంట మాస్టర్లుగా పనిచేసేవారిగా పోలీసులు గుర్తించారు.