WGL: యువతను మత్తు పదార్థాల ప్రభావం నుంచి దూరంగా ఉంచి, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ సత్య శారద సూచించారు. కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన జిల్లా నార్కోటిక్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల రవాణా, వినియోగం నివారణపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.