TG: సివిల్ సర్వీసెస్ పరీక్షా ఫలితాల్లో ఎంపికైన తెలంగాణ అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. 43 మందికి రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకం కింద రూ. లక్ష ఇస్తామని ప్రకటించారు. విజేతలు ఇంటర్వ్యూలకు సన్నద్ధం కావడానికి ఈ ప్రోత్సాహకం ఇస్తున్నామన్నారు. కాగా, మెయిన్స్ పరీక్షకు సన్నద్ధం కావడానికి కూడా గతంలో ప్రభుత్వం రూ.లక్ష ఇచ్చిన విషయం తెలిసిందే.