ప్రకాశం: పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్ద చెర్లోపల్లి మండలం గుంటూరు లింగన్నపాలెం లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. ఆయనకు జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీ, టీడీపీ ఇంఛార్జ్లు, కలెక్టర్, ఎస్పీ స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన సభాస్థలికి చేరకుని, MSME కి సంబంధించిన శిలాఫలకాన్ని ఆయన ప్రారంభించారు.