TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు పోలింగ్ 20.76 శాతం నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు ఉదయం నుంచే బారులుతీరారు. దీంతో ఈ సారి పోలింగ్ శాతం భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు, నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఉదయం 9 గంటలకు పోలింగ్ 9.2 శాతం నమోదైన విషయం తెలిసిందే.