ఈనెల 14 నుంచి టీమిండియా, సౌతాఫ్రికా మధ్య మొదటి టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్ వేదికగా జరగనుంది. అయితే, ఢిల్లీ పేలుడు నేపథ్యంలో పోలీసులు కోల్‌కతాలో ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. అలాగే.. టీమిండియా, దక్షిణాఫ్రికా జట్టు ప్లేయర్లకు భద్రత కట్టుదిట్టం చేశారు. వారు బస చేయనున్న హోటళ్ల వద్ద కూడా పటిష్ఠ నిఘా ఏర్పాటు చేశారు.