VZM: రూ.102 కోట్లతో పీవీసీ గ్రూప్ నిర్మించనున్న అరసాడ బయో గ్యాస్ ప్లాంట్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్ విధానంలో మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాజాం తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వీసీలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఎమ్మెల్యేలు, కలెక్టర్ రామ సుందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.