MBNR: మా న్యాయమైన హక్కుల కోసం పోరాటాలు చేయాల్సిన అగత్యం ఏర్పడిందని బీసీ జేఏసీ కన్వీనర్ బెక్కెం జనార్ధన్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అగ్రవర్ణాలు బీసీలను దశాబ్దాలుగా అణగదొక్కుతున్నాయని, ఇక చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.