తాను ఫిట్‌గా ఉన్నప్పటికీ టీమిండియాకు ఎంపిక చేయలేదని మహ్మద్ షమీ చేసిన ఆరోపణలపై బీసీసీఐ స్పందించింది. అతడిని గతంలో ఇంగ్లండ్ సిరీస్‌కు ఎంపిక చేయాలని భావించినట్లు తెలిపింది. అందుకోసం ముందుగా IND-A తరఫున ఇంగ్లండ్‌కు పంపి అతడి ఫిట్నెస్ టెస్ట్ చేయాలని అనుకున్నట్లు చెప్పింది. కానీ, షమీ తనకు ఇంకా సమయం కావాలని చెప్పడంతో అతడిని పరిగణనలోకి తీసుకోలేదని పేర్కొంది.