KMR: ఢిల్లీలో జరిగిన బాంబు దాడి నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు మంగళవారం కామారెడ్డిలో విస్తృత తనిఖీలు చేపట్టారు. అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్, రైల్వే స్టేషన్, వాణిజ్య ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్ సహాయంతో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో పలువురు అనుమానితులను ప్రశ్నించి వారి వివరాలు సేకరించారు.