కృష్ణా జిల్లా పెడన మదర్సాలో ముగ్గురు విద్యార్థులు కనపడకపోవడంతో కలకలం సృష్టించింది. ఈ ఘటనపై మదర్స ప్రిన్సిపాల్ స్థానిక పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు వెంటనే మదర్సకు చేరుకుని విచారణ చేపట్టారు. ప్రిన్సిపాల్ తెలిపిన వివరాల ప్రకారం, అదృశ్యమైన విద్యార్థులు బంటుమిల్లి, కాకినాడ, విజయవాడ ప్రాంతాలకు చెందిన వారున్నారు.