BDK: భద్రాచలం శ్రీ సీతారామ దేవస్థానంలో జై శ్రీరామ్ అచ్చుతో ఇటుకల తయారీకి చర్యలు చేపట్టాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ దేవస్థానం ఈవో సిబ్బందికి సూచించారు. సంబంధిత CSEB మిషన్ను కలెక్టర్ మంగళవారం భద్రాచలం పర్యటనలో భాగంగా పరిశీలించారు. జై శ్రీరామ్ అచ్చు ఉన్న ఇటుకల తయారీకి కార్యాచరణను ముందుకు తీసుకెళ్లాలని సంబందిత అధికారులకు సూచనలు చేశారు.