NLG: క్రీడలతో మానసిక ధైర్యం పెరుగుతుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నాగార్జునసాగర్ మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ గురుకుల విద్యాలయంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా అండర్ 14, 19 క్రీడా పోటీలను మంగళవారం ఆమె ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఆరోగ్యకరమైన జీవితం క్రీడల ద్వారా కలుగుతుందని పేర్కొన్నారు. ఆమె క్రీడాజ్యోతిని వెలిగించి, ఆల్ ది బెస్ట్ అంటూ.. విద్యార్థులను ఉత్తేజపరిచారు.