దేశ స్వాతంత్య్రం వచ్చిన తర్వాత బీహార్లో ఎక్కువ శాతం పోలింగ్ నమోదు కావటం ఇదే తొలిసారని సీఈసీ జ్ఞానేశ్ కుమార్ వెల్లడించారు. 2025 ఎన్నికల్లో దాదాపుగా 66.9 శాతం పోలింగ్ జరిగిందని తెలిపారు. అలాగే రాష్ట్రంలోని 71 శాతం మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పారు. ఈ ఎన్నికలు ఎంతో పారదర్శకంగా, ప్రశాంతంగా జరిగాయని పేర్కొన్నారు.