ఢిల్లీ పేలుడు కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. భారీ విధ్వంసం సృష్టించేందుకు జైష్-ఎ-మహ్మద్(JEM) మాడ్యూల్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఐఈడీని మరోచోటికి తరలిస్తుండగా అది ప్రమాదవశాత్తు పేలి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. పేలుడు పదార్తాలు ఐఈడీగా పూర్తిగా మార్చకముందే పేలడం వల్ల పెను ప్రమాదం తప్పిందని భావిస్తున్నారట. కాగా, ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.