KMM: జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఖమ్మం రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు. ఆ పార్టీకి చెందిన గుండాలు, రౌడీలు పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటి నుంచే దౌర్జన్యాలకు దిగారని, అరాచకం సృష్టించారని మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ పూర్తిగా వైఫల్యం చెందిందని, అధికార కాంగ్రెస్ దొంగ ఓట్లు వేయించుకుందని ఆరోపించారు.