SRPT: రైతులు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ శుభ్రమైన ధాన్యాన్ని తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. ఇవాళ రాత్రి మద్దిరాల మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని సీరియల్ ప్రకారం రిజిస్టర్లో నమోదు చేసుకోవాలని నిర్వాహకులకు సూచించారు.