SKLM: సంతబొమ్మాళి మండలం గోవిందపురం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రెయ్యమ్మ తల్లి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. గత మూడు రోజుల నుంచి అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ ఉత్సవాలు మంగళవారం రాత్రితో ముగిశాయి. కాగా ఉత్తరాంధ్రతో పాటు ఒరిస్సా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఘటాలు, ఉత్సవ విగ్రహాలకు భక్తులు పూజలు చేశారు.