KMR: బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్ ఊర చెరువులో మంగళవారం మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేపపిల్లలను విడుదల చేశారు. మత్స్యశాఖ అధికారి డోలీసింగ్ ఆధ్వర్యంలో మొత్తం 3.58 లక్షల చేపపిల్లలను వదిలారు. ఈ సందర్భంగా డోలీసింగ్ మాట్లాడుతూ.. చెరువులలో చేపల ఉత్పత్తి పెంపుతో గ్రామీణ మత్స్యకారుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందన్నారు.