MBNR: ఢిల్లీలో జరిగిన బాంబు దాడికి నిరసనగా మంగళవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మృతులకు నివాళులర్పించారు. అనంతరం నగర కార్యదర్శి శివప్రసాద్ మాట్లాడుతూ.. అక్రమార్కుల బాంబు దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హాస్టల్స్ విభాగ కన్వీనర్ సతీష్ పాల్గొన్నారు.