JGL: మెట్పల్లి పట్టణంలోని దుబ్బవాడలో ఎల్లగంగ నరసయ్య (74)ను హత్య చేసిన ఆయన కుమారుడు ఎల్ల అన్వేష్(32)ను మంగళవారం అరెస్టు చేసినట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. తండ్రి పెళ్లి చేయలేదని, ఏదైన పనిచేయమని ఒత్తిడి చేయడంతోనే హత్యకు పాల్పడినట్లు వివరించారు. అతడిని రిమాండ్కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.