MHBD: మరిపెడ మండలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ జి. సురేందర్ రెడ్డి కాకతీయ యూనివర్సిటీ నుండి వృక్షశాస్త్రంలో డాక్టరేట్ పట్టా అందుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జాతి ఔషధ మొక్కలపై పరిశోధన చేసినందుకుగాను.. డాక్టరేట్ పట్టా పొందినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా సురేందర్‌ను పలువురు నాయకులు, ఉపాధ్యాయులు అభినందించారు.