KNR: తిమ్మాపూర్లోని SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో పురుషులకు “ఫోటోగ్రఫీ & వీడియోగ్రఫీ” పై ఉచిత శిక్షణకు దరఖాస్తుల గడువు ఈనెల 12 వరకు పొడిగించినట్లు సంస్థ డైరెక్టర్ డీ. సంపత్ తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన పురుషులు 19 నుంచి 45 సం.ల వారు అర్హులని, ఆసక్తి గల వారు ఈ నెల 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చనన్నారు.