SRCL: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులపై ఎంపీడీవోలు ప్రతి రోజు సమీక్ష చేయాలని ఇన్ఛార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులపై జిల్లాలోని జడ్పీ సీఈవో, ఆర్డీవోలు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు ఇతర శాఖల అధికారులతో జిల్లా కలెక్టరేట్ నుంచి ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.