KNR: గర్రెపల్లిలో జరిగిన 69వ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎస్జీఎఫ్ అండర్-14 వాలీబాల్ పోటీల్లో జిల్లా జట్టు రెండో స్థానం సాధించింది. దీంతో స్టేట్ మీట్‌కు చల్లూరు జడ్పీహెచ్ఎస్ విద్యార్థి పూదరి మణిదీప్ ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా మణిదీప్‌ను ప్రధానోపాధ్యాయులు సంపత్ కుమార్ చారి, పీడీ రజిని, క్రీడాకారులు, గ్రామస్తులు అభినందించారు.