పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ భారత్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇస్లామాబాద్‌లో జరిగిన ఆత్మాహుతి దాడికి భారతదేశమే కారణమని అన్నారు. ఆప్ఘాన్ కేంద్రంగా పని చేస్తున్న భారత్ మద్దతు ఉన్న ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారని తెలిపారు. అలాగే ఆప్ఘాన్ సరిహద్దులో ఉన్న వానా క్యాడెట్ కాలేజీలోని అమాయక పిల్లలపై కూడా అదే ఉగ్రవాద సంస్థ దాడి చేసిందని పేర్కొన్నారు.