SKLM: ఇచ్చాపురం పట్టణానికి చెందిన వున. సంతోష్ కుమార్, బెల్లాన. శ్రీకాంత్ ఏపీ రాష్ట్ర కళింగ వైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్లుగా నియమితులైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వారు స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అశోక బాబును ఇవాళ ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి, కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజల సంక్షేమం కోసం కృషి చేయాలని ఎమ్మెల్యే అన్నారు.