MNCL: మద్యం తాగి వాహనాలు నడపవద్దని జన్నారం ఎస్సై గొల్లపల్లి అనూష హెచ్చరించారు. మంగళవారం జన్నారంలోని బస్టాండ్ ఏరియా, ధర్మారం చౌరస్తాలలో వాహనాలను తనిఖీ చేశారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ.. అతివేగం, మద్యం తాగి వాహనాలు నడపడంతో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని వెల్లడించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో అందరూ భాగస్వాములు కావాలని సూచించారు.