ATP: కళ్యాణదుర్గం-బళ్లారి మార్గంలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరు గొర్రెలు మృతి చెందాయి. బస్సులోని 42 మంది ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులను మరో బస్సులో గమ్యస్థానాలకు చేర్చారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.