ఎర్రకోట పేలుడు ఘటనలో మృతి చెందిన వారికి ఢిల్లీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ఈ దుర్ఘటనలో చనిపోయిన వారికి ఒక్కొక్కరికి రూ.10 లక్షలు, శాశ్వతంగా అంగ వైకల్యం పొందిన వారికి రూ.5 లక్షలు, అలాగే తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా బాధిత కుటుంబాలను ఆదుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.