NLG: చిట్యాల పోలీస్ స్టేషన్ను మంగళవారం నల్గొండ డీఎస్పీ కొలను శివరాంరెడ్డి సందర్శించారు. వార్షిక తనిఖీలో భాగంగా రికార్డులను, లాకప్స్, స్టోరేజ్ రూమ్ ఇతర పరికరాలను పరిశీలించారు. తదనంతరం విధులను పారదర్శకంగా క్రమశిక్షణతో సేవాభావంతో నిర్వర్తించాలని సిబ్బందికి సూచించారు. రికార్డులను జాగ్రత్తగా భద్రపరచాలని, టెక్నాలజీని వినియోగించుకోవాలని తెలిపారు.