TG: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలవబోతోందని TPCC చీఫ్ మహేష్ గౌడ్ జోస్యం చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ వైపు ప్రజలు నిలిచారని ఆకాంక్షించారు. రేవంత్ ఎప్పటికప్పుడు మమ్మల్ని ముందుకు నడిపించారని.. కాంగ్రెస్ గెలుపు కోసం పని చేసిన వాళ్లందరికీ ధన్యవాదాలు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించడంలో సఫలమయ్యామని పేర్కొన్నారు.