SRPT: హుజూర్నగర్ పట్టణంలోని పాత బస్టాండుతో పాటు పరిసర ప్రాంతాలలో పోలీసులు ఇవాళ విస్తృత తనిఖీలు నిర్వహించారు. సీఐ చరమంద రాజు ఆధ్వర్యంలో బాంబ్ స్క్వాడ్ సహకారంతో బస్సులు, ప్రయాణికుల సామానులను పరిశీలించారు. రద్దీ ప్రదేశాలలో భద్రతా చర్యలు చేపట్టారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులను గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని CI కోరారు.