ADB: జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో చోటు చేసుకుంటున్న ద్విచక్ర వాహనాల చోరీలను అరికట్టడానికి పోలీసులు చర్యలు చేపట్టారు. మంగళవారం నుంచి రిమ్స్ ప్రధాన ద్వారం వద్ద తనిఖీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 24 గంటలు ఉండేలా ఇద్దరు ఏఆర్ పోలీసులను నియమించినట్లు టూటౌన్ సీఐ నాగరాజు తెలిపారు. బయటకు వెళ్లే ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తామని సీఐ స్పష్టం చేశారు.