SRPT: విద్యార్థి భవిష్యత్‌కు పదవ తరగతి మొదటి అడుగు అని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. మంగళవారం ఆయన తిరుమలగిరి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థుల స్పెషల్ క్లాస్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అందరికీ పుస్తకాలు వచ్చాయా? సిలబస్ ఎంతవరకు అయింది? హాస్టల్లో భోజనం బాగుందా? చదువులో ఏమైనా సమస్యలు ఉన్నాయా? అని అడగి తెలుసుకున్నారు.