ఢిల్లీ పేలుడు ఘటనను ఉగ్రవాదుల చర్యే అని కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో మోదీ సర్కార్ తదుపరి ఎలాంటి చర్య తీసుకుంటుందోనని దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో దేశంలో ఎలాంటి ఉగ్రదాడి జరిగినా.. భారత్ ప్రత్యక్ష దాడులకు దిగుతుందని మోదీ ప్రకటించారు. ఈ క్రమంలో యుద్ధానికి దిగుతుందా? లేక మరోసారి ఉగ్రస్థావరాలపై దాడులు చేస్తుందా? అనేది చూడాలి.